1. కర్త నేననే భావనొద్దురా
కర్మ ఫలముపై ఆశవీడరా
3. సిద్ధులందు నీ దృష్టి నిలిచెనా
4. ఇంద్రియాలకు కేంద్రమేదియో
పరమతత్వపు మూలమే అది
6. కర్మశీలుడూ భావశూన్యుడూ
శుద్ధ చిత్తుడూ జీవన్ముక్తుడూ
7. నీవు ఎవరనే నిత్యచింతనే
అన్ని నీవనే తెలివి నిచ్చురా
8. అద్దమందు నీ ప్రతిమలాగునే
ప్రత్యగాత్మయే జీవాత్మగానయే
9. నేనెవరనే సత్యశోధనే
రమణ మార్గపు జ్ఞానసాధనం
10. అహం అన్నదీ ఎచటనున్నదీ
ఈ విచారణే జ్ఞానపద్ధతి
11. నేను లేని ఈ అనుభవంబదే
రమణదేవుని అనుగ్రహంబులే
12. బంధముక్తికీ అతీతమైనదీ
బాహ్యహీనమౌ ఆత్మస్వస్థితి
13. అహంకారమే అణగినంతనే
ఆత్మరూపము వెలుగునంతనే
14. వృత్తులన్నియూ అహంవెంబడే
అహంవృత్తియే మనసుయైనది
15. వలను చిక్కిన పక్షిలాగున
శ్వాస నిలిపితే మనసు నిలచును
16. చిత్తమందునీ మనసు నిలిచెనా
స్వప్రకాశమౌ ఆత్మ దర్శనం
17. అరుణశైలమే పుణ్యథామము
జ్ఞానసిద్ధిదం గిరి ప్రదక్షిణం
18. విను నిశీథిలో ప్రజ్వరిల్లిన
జ్ఞాన జ్యోతియే రమణ భాస్కరం
19. కేవలంబు నీ నామ స్మరణచే
పట్టిలాగెనే రమణ మంత్రమై
20. వేదవిద్యలు తెలియకున్ననూ
ఒక్క చూపుతో తేటతెల్లమౌ
21. మోహమందునా చిక్కకుండుమా
రమణుచరణమూ విడువకుండుమా
కర్మ ఫలముపై ఆశవీడరా
2. ఉట్టినెక్కక స్వర్గమెక్కడా
నిన్నుతెలియక పరుల చింతనా3. సిద్ధులందు నీ దృష్టి నిలిచెనా
పతనమౌను నీ తత్త్వ జీవనం
4. ఇంద్రియాలకు కేంద్రమేదియో
పరమతత్వపు మూలమే అది
5. రమణనామమే పరమపావనం
నిత్యస్మరణతో ముక్తి నిశ్చయం6. కర్మశీలుడూ భావశూన్యుడూ
శుద్ధ చిత్తుడూ జీవన్ముక్తుడూ
7. నీవు ఎవరనే నిత్యచింతనే
అన్ని నీవనే తెలివి నిచ్చురా
8. అద్దమందు నీ ప్రతిమలాగునే
ప్రత్యగాత్మయే జీవాత్మగానయే
9. నేనెవరనే సత్యశోధనే
రమణ మార్గపు జ్ఞానసాధనం
10. అహం అన్నదీ ఎచటనున్నదీ
ఈ విచారణే జ్ఞానపద్ధతి
11. నేను లేని ఈ అనుభవంబదే
రమణదేవుని అనుగ్రహంబులే
12. బంధముక్తికీ అతీతమైనదీ
బాహ్యహీనమౌ ఆత్మస్వస్థితి
13. అహంకారమే అణగినంతనే
ఆత్మరూపము వెలుగునంతనే
14. వృత్తులన్నియూ అహంవెంబడే
అహంవృత్తియే మనసుయైనది
15. వలను చిక్కిన పక్షిలాగున
శ్వాస నిలిపితే మనసు నిలచును
16. చిత్తమందునీ మనసు నిలిచెనా
స్వప్రకాశమౌ ఆత్మ దర్శనం
17. అరుణశైలమే పుణ్యథామము
జ్ఞానసిద్ధిదం గిరి ప్రదక్షిణం
18. విను నిశీథిలో ప్రజ్వరిల్లిన
జ్ఞాన జ్యోతియే రమణ భాస్కరం
19. కేవలంబు నీ నామ స్మరణచే
పట్టిలాగెనే రమణ మంత్రమై
20. వేదవిద్యలు తెలియకున్ననూ
ఒక్క చూపుతో తేటతెల్లమౌ
21. మోహమందునా చిక్కకుండుమా
రమణుచరణమూ విడువకుండుమా