వస్తున్నాడొస్తున్నాడొస్తున్నాడోయ్
నల్లనివాడల్లరివాడొస్తున్నాడోయ్
సాగరగర్భంలో సోమకాసురుని తృంచి
వేదాలగాచినోడొస్తున్నాడోయ్
నీట మునిగిన భువిని
మూపురాన కెత్తుకోన్న
శ్రీకూర్మ రూపుడిక వస్తున్నాడోయ్
హిరణ్యాక్షునిజంపి అవనిభారముదీర్చి
ఆదివరాహమూరితి వస్తున్నాడోయ్
ప్రహ్లాదవరదుడై హిరణ్యకశిపునడచి
నరసింహమైన వాడొస్తున్నాడోయ్
బలి గర్వమణచి సురవరులను బ్రోచి
వామనావతారుడిదిగో వస్తున్నాడోయ్
హుంకరించు క్షాత్రకుల పరిమార్చిగాచి
భార్గవరాముడిక వస్తున్నాడోయ్
రావణుని వధించి రమణి సీత నేలిన
ధర్మమూర్తి రాముడు వస్తున్నాడోయ్
కోకోటి మహిమల గోపాలుర గాచిన
రాథాంతరంగుడు వస్తున్నాడోయ్
ధర్మాల సారాన్ని నరులకు బోధింప
గౌతముండదిగో వస్తున్నాడోయ్
కలియుగంబులోన జనులపాపముబాప
శ్రీ వేంకటేశుడై వస్తున్నాడోయ్
No comments:
Post a Comment