అమ్మడేడే ముద్దుగుమ్మడేడే
బొజ్జనిండ పాలుతాగి వీడు పండుకోడే
నల్లవాడే ఒట్టి దొంగవాడే
పొరుగిండ్ల పాలుపెరుగు జుర్రు తాడే
అందగాడే వీడు అల్లరివాడే
అదిలించబోతే వీడు అలుగుతాడే
వన్నెకాడే వీడు సిగ్గులోడే
సొట్టబుగ్గల చిన్నినవ్వుల సొగసుకాడే
కాళ్ళాకు గజ్జెలు కట్టి
కస్తూరి తిలక మెట్టి
పట్టూదట్టీలు కట్టి
పరుగిడుతాడే
ఒకచోట నిలువలేని
వరహాల పిల్లగాడు
వరాల పట్టివాడు
వచ్చినాడే
చక్కాని మోమువాడు
చురుకు చూపులవాడు
ముద్దుమాటలవాడు
వేగరాడే
కన్నయ్యరారా అంటే
బిరబిరబిరబిర వచ్చేస్తాడే
ముద్దివ్వరారా అంటే
మురిపాల కురిపిస్తాడే
మన్నుతినేటివాడు
మహీమాల చూపేటోడు
మా ఇంటి వన్నెకాడు
చేరరాడే
No comments:
Post a Comment