.. దశశ్లోకీ (లేదా) నిర్వాణ దశకము
..
శంకరభగవత్పాదులవారు తమ గురువులైన గోవింద భగవత్పాదా చార్యులవారిని సమీపించి
శిష్యస్వీకారానికై ప్రార్థించగా, వారు శంకరులను నీవెవరవో ఎఱుకపరచమన్నప్పుడు, శంకరుల
నోటివెంట జాలువారినవి ఈ అద్వైతామృతబిందువులు.
న భూమిర్న తోయం న తేజో న వాయుః
న ఖం నేన్ద్రియం వా న తేషాం సమూహః
అనేకాన్తికత్వాత్ సుషుప్త్యేకసిద్ధః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 1 ..
(నేను భూమిని కాను, నీటిని
కాను, అగ్నిని కాను, వాయువును కాను, ఆకాశాన్ని కాను, ఏ ఇంద్రియాన్నీ లేదా వాటి సమిష్టినీ
కాను, అనేకత్వంగా సుషుప్త్యావస్థలో మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న వర్ణా న వర్ణాశ్రమాచారధర్మా
న మే ధారణాధ్యానయోగాదయోపి
అనాత్మాశ్రయాహంమమాధ్యాసహానాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 2 ..
(ఏ వర్ణానికి చెందినవాడను
కాను. ఏ వర్ణాశ్రమ ఆచార ధర్మమూ నాకు లేదు. ధారణ, ధ్యాన, యోగాదులతో నాకు సంబంధంలేదు, అనాత్మపదార్థాలనాశ్రయించిన ‘నేను’, ‘నాది’ అనే ఇంద్రియారోపితాలను విసర్జించగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న మాతా పితా వా న దేవా న లోకా
న వేదా న యజ్ఞా న తీర్థ బ్రువన్తి
సుషుప్తౌ నిరస్తాతిశూన్యాత్మకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 3 ..
(లేరు నాకు మాతా, పితరులు.
పూజనీయ దేవతలు లేరు. నివాస లోకములు లేవు. తెలియదగిన వేదాలు లేవు. చేయవలసిన యజ్ఞములు
లేవు. సేవించవలసిన తీర్థములు
లేవందురు. సుషుప్త్యావస్థలో ఇవన్నీ లేని
శూన్యాత్మకతగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న సాఖ్యం న శైవం న తత్పాంచరాత్రం
న జైనం న మీమాంసకాదేర్మతం వా
విశిష్ఠానుభూత్యా విశుద్ధాత్మకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 4 ..
(సాంఖ్య
మతానుయాయిని కాను. శైవుణ్ణీ కాను. పాంచరాత్ర సంప్రదాయినీ కాను. జైనమతస్థునినీ కాను. మీమాంసాది వాదినీ కాను. పరమ శుద్ధమైన ఆత్మకత్వంగా విశిష్ట అనుభూతితో మిగిలే
పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న చోర్ధ్వ న చాధో న చాన్తర్న బాహ్యం
న మధ్యం న తిర్యక్ న పూర్వాఽపరా దిక్
వియద్వ్యాపకత్వాదఖణ్డైకరూపః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 5 ..
(నాకు ఊర్ధ్వంగా ఏమీ
లేదు. అధోభాగాన ఏమీ లేదు. నాకు అంతరమూ లేదు, బాహ్యమూ లేదు. నాకు మధ్యమమూలేదు, ఇరు ప్రక్కలా
అనేదే లేదు. నాకు ముందు లేదు, నా వెనుకా
లేదు. విశ్వమంతా వ్యాపించియున్న
అవిచ్ఛిన్నత్త్వరూపంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న శుక్లం న కృష్ణం న రక్తం న పీతం
న కుబ్జం న పీనం న హ్రస్వం న దీర్ఘమ్
అరూపం తథా జ్యోతిరాకారకత్వాత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 6 ..
(నాది తెలుపు
వర్ణము కాదు, నలుపు వర్ణము కాదు, ఎఱుపు వర్ణము కాదు, పచ్చ వర్ణమూ కాదు. కృశించినవానినీ కాను. స్థూలమునూ కాను. కురుచను కాను.
పొడగరినీ కాను. రూపరహిత జ్యోతి
ఆకారకత్వంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న శాస్తా న శాస్త్రం న శిష్యో న శిక్షా
న చ త్వం న చాహం న చాయం ప్రపంచః
స్వరూపావబోధో వికల్పాసహిష్ణుః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 7 ..
(నాకు పాలకులూ
లేరు. నే పాటింపవలసిన నియమాలు లేవు. నే విద్యార్థినీ కాను, నేర్వవలసిన విద్యయూ
లేదు. నేను ‘నీవు’ కాదు. నేను ‘నేను’నూ కాను.
ఈ ప్రపంచాన్నీ కాను. స్వస్వరూపపు ఎఱుకతో వికల్పంగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల
నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
న జాగ్రన్ న మే స్వప్నకో వా సుషుప్తిః
న విశ్వౌ న వా తైజసః ప్రాజ్ఞకో వా
అవిద్యాత్మకత్వాత్ త్రయాణం తురీయః
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 8 ..
(నాకు జాగ్రత్తు
లేదు. నాకు స్వప్నము లేదు సుషుప్తీ
లేదు. నేను విశ్వుడను కాను, తైజసుడను లేదా
ప్రాజ్ఞుడనూ కాను. అవిద్యాత్మకత్త్వాన్ని దాటి తురీయ స్థితిలో మిగిలే పరమ మంగళకరమైన,
కేవల నిర్గుణ తత్త్వాన్నిమాత్రమే.)
అపి వ్యాపకత్వాత్ హితత్వప్రయోగాత్
స్వతః సిద్ధభావాదనన్యాశ్రయత్వాత్
జగత్ తుచ్ఛమేతత్ సమస్తం తదన్యత్
తదేకోఽవశిష్టః శివః కేవలోఽహమ్ .. 9 ..
(దేనికి భిన్నమైన
ఈ సమస్త జగత్తూ తుచ్ఛమైనదో, సర్వత్రా వ్యాపించినదీ, సత్యముగా నిరూపితమైనదీ,
స్వతసిద్ధమైనదీ, అట్టి ఇతరములపై ఆధారపడని తత్త్వముగా మిగిలే పరమ మంగళకరమైన, కేవల నిర్గుణ
తత్త్వాన్నిమాత్రమే.)
న చైకం తదన్యద్ ద్వితీయం కుతః స్యాత్
న కేవలత్వం న చాఽకేవలత్వమ్
న శూన్యం న చాశూన్యమద్వైతకత్వాత్
కథం సర్వవేదాన్తసిద్ధం బ్రవీమి .. 10 ..
(ఏకమే కాని ఆ
తత్త్వమునకు అన్యమైన ద్వితీయమెక్కడిది? కేవలమూ కాదు, కేవలము కాని అనేకమూ కాదు. శూన్యమూ కాదు అశూన్యమూ కాదు. అద్వితీయమైన ఆ
తత్త్వాన్ని, ఉపనిషత్తులు ప్రతిపాదించినప్పటికీ, ఏమని చెప్పను?)
.. ఇతి శ్రీమచ్చన్కరాచార్యవిరచితం దశశ్లోకీ సమాప్తం
..
No comments:
Post a Comment