ఇదియే సత్యము – ఇదియే నిత్యము
నిగమార్థంబును నిక్కము నెఱగిన
ఈశంబుగ ఈ విశ్వము నిత్యము -ఇదియే-
దృక్కులు చూడని దృశ్యంబిదియే
వాక్కు వచింపని వచనంబిదియే
మనసుకు తోచని మర్మంబిదియే
పరముల కన్నింటి పరమంబిదియే -ఇదియే-
అక్షికి ఆవల అక్షయమైనదీ
కుక్షికి లోపల సుస్థిరమ్మదీ
వక్షాంతరమ్మున వెలుగుచున్నదీ
విశ్వమూలమై విత్తుగనున్నదీ -ఇదియే-
వేంకటనాధుని పదముల సన్నిధి
పెనుచీకటుల పారద్రోలునది
కోటిసూర్యుల తేజ ప్రభయది
కోరిన క్షణమే దొరకే పెన్నిధి -ఇదియే-
No comments:
Post a Comment