Tuesday, December 6, 2011

ఎంకన్న సామీ

ఏమయ్య సామీ, ఓ ఎంకన్న సామీ
దండాలు సామీ, దయజూడు సామీ
వేడికోలు సామీ, ఏడుకొండల సామీ

ఏపూటకాపూట కడుపుకాలుతోన్నా
                   మా బతుకు సాలిపోతోన్నా
నీకు మొక్కందే నిన్నోపాలి సూడందే
                  దినంగడవదయ్య సుకం ఎరుగమయ్యా
సీకుసింత పక్కనెట్టి ఒక్కదండం పెట్టినీకు
                  బతుకుబండిలాగుతాండాం

చిన్నప్పుడప్పుడెపుడో అయ్యనెత్తికెత్తుకొంటే
అప్పుడొక్కమాలి చూశా అయ్యసామీ నిన్ను
మళ్లాచూసే ఆశేలేదు బతుకెళ్ళమారే లోపు

అండాదండ నీవంటూ ఆనుకోని గడియేలేదు
నీ ఊసులే ఊపిరిగా జనమజనమలెళ్ళదీస్తా
నువ్వు లేని సొరగమైన నాకక్కరలేదయ్యా

1 comment:

  1. Blog theme/layout is beautiful. The Post are very nice. Liked the posts -- Subrahmanyam

    ReplyDelete