పట్టుపుట్టముగట్టినాడు పరంధాముడూ
పసుపు పారాణిపెట్టి, కళ్ళకాటుకలద్ది
వెతదీర్ప నిలచినాడు కరుణాంతరంగుడూ
ఒడల చందనమలిమి, కస్తూరి తిలకమెట్టి
సొబగు సోయగాల సుందరాంగుడూ
వేడుక శ్రీ వేంకటేశు విభుడాతడు హృదయాలను
ముదమారగ మురిపించే మందహాసుడూ
కదలీ శ్రీ ఆనంద నిలయ ప్రభువై పరమాత్మడు
కలికల్మష నాశకుడై కరుణించువాడూ
వసుధైక విభుడాతడు వజ్రమకుటధారుడు
ఏకైక ప్రభువాతడు ఏడుకొండలవాడు
ముక్కోటి దేవతల మూలకారణంబితడు
మురిపించీ మరపించే మోహనాంగుడూ
ఎలతి ఎలతి పదాలతో ఎఱుకైనవాడు
నియతి నియతి మార్గాల పలుకుచున్నాడు
వేదోక్త విధులలో వేగిర పడుచున్నవాడు
శయనించి శేషాద్రిని భాసించినవాడూ
No comments:
Post a Comment