కందామా కనులారా
కందామా కనులారా కమలాక్షునీ
భవ్యగుణధామునీ
దివ్యచరితాత్మునీ
రమ్య రమణీయునీ
పునుగు, జవ్వాది అలముచున్నారదిగో
పూర్ణేందు ముఖునీ
విమల చారిత్రునీ
అమృతాభిషేకమ్ముల కురియుచున్నారదిగో
అరవింద నేత్రునీ
ఆర్తత్రాణ పరాయుణీ
ఆనంద నిలయాన విమలానంద శేఖరుడు
ఆరూఢమైనాడది ఆనందముప్పొంగ
వేదనారాయణుడదిగో వేంకటాద్రి మీదనూ
వెలసియున్నాడదిగో వెతలదీర్చగానూ
No comments:
Post a Comment