Tuesday, December 6, 2011

చూడరండి కనులారా

చూడరండి కనులారా మనసారా పాడరండి  
కప్పురపు కాంతిలో కలికి శోభనాంగునీ
శంఖ చక్ర ధారుడై చిదానందుడూ
          అమ్మ అలమేల్మంగతో అలరించినాడూ
మకర కుండలాలు మెరయుచున్నవి అదిగో
          చెక్కిలి సొంపుల విరియబూయ
చిరుత గడ్డము మీది చిరునగవుల పూలవిగో
          కొనగంటి చూపుల కరుణామృతమదిగో
నిండైన తిరునామము మోము సొంపదిగో
          ధగధగల మెరపించు మణిమకుటమ్మదిగో

ఇరుదండల ధరియించిన నాగ భూషణాలు
          కటివరద హస్తాలతో కనువిందైనాడు
బ్రహ్మాది దేవతల వందనాలందిన వదిగో
          పాదారవిందాల శరణుగోరుచునూ

No comments:

Post a Comment